ముందుకు వెళ్లాలనుకుంటే ఆధారాలతో వస్తా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రివిలైజ్ కమిటీ ఇచ్చిన నోటీసుపై స్పందించారు. తాను హైదరాబాద్ లో ఉన్నానని, కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నానని ఇప్పుడప్పుడే విచారణకు [more]

Update: 2021-03-20 00:54 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రివిలైజ్ కమిటీ ఇచ్చిన నోటీసుపై స్పందించారు. తాను హైదరాబాద్ లో ఉన్నానని, కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నానని ఇప్పుడప్పుడే విచారణకు హాజరు కాలేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషనర్ కు నోటీసులు జారీ చేసే అధికారం ప్రివిలేజ్ కమిటీకి లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటే తాను తగిన ఆధారాలతో ముందుకు వస్తానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. తాను ఎవరి హక్కులకు భంగం కల్గించలేదని ఆయన తెలిపారు.

Tags:    

Similar News