నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లింది అందుకేనా?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఎన్నికలు సజావుగా నిర్వహించినా తనపై ప్రభుత్వం ఇంకా కక్ష సాధింపు చర్యలకు [more]

Update: 2021-03-21 01:13 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఎన్నికలు సజావుగా నిర్వహించినా తనపై ప్రభుత్వం ఇంకా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారంటున్నారు. ఇందులో గవర్నర్ కార్యాలయాన్ని కూడా ఇరికించారని చెబుతున్నారు. తాను గవర్నర్ కార్యాలయంతో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలు కాన్ఫిడెన్షియల్ అని, అవి బయటకు ఎలా వచ్చాయో సీబీఐ చేత విచారణ జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో గవర్నర్ కార్యదర్శి, చీఫ్ సెక్రటరీతో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు. ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు అందిన తర్వాతనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పిటీషన్ వేయడం గమనార్హం.

Tags:    

Similar News