బ్రేకింగ్ : నిమ్మగడ్డ కేసులో బొత్స, పెద్దిరెడ్డికి నోటీసులు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ [more]

Update: 2021-03-23 07:36 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాను గవర్నర్ కు రాసిన లేఖలు లీకవుతున్నాయని, మంత్రులు వాటిని చూపించి మాట్లాడుతున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. తాను గవర్నర్ కు రాసిన లేఖలు సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. అయితే దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News