నేను ఆ ఎన్నికలను నిర్వహించలేను… చేతులెత్తేసిన నిమ్మగడ్డ

తాను జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుందన్నారు. [more]

Update: 2021-03-24 07:34 GMT

తాను జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుందన్నారు. ఆ ఎన్నికలను తన తర్వాత వచ్చే వారు నిర్వహిస్తానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని చెప్పారు. అయితే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవమయిన చోట ఫిర్యాదు చేసుకునే వీలుందన్నారు. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News