నేటితో నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈరోజు ఆయన ఎన్నికల కమిషనర్ గా బాద్యతలను నిర్వహించే చివరి రోజు. నిమ్మగడ్డ [more]

Update: 2021-03-31 00:40 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈరోజు ఆయన ఎన్నికల కమిషనర్ గా బాద్యతలను నిర్వహించే చివరి రోజు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2016లో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఆయన ను మధ్యలో తప్పించి కనగరాజ్ ను కమిషనర్ గా ప్రభుత్వం తెచ్చినా న్యాయపోరాటం చేసి తిరిగి తమ పదవిని దక్కించుకున్నారు. ఎన్నికల సమయంలో అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. బీజేపీ నేతలతో ఒక ప్రయివేటు హోటల్ లో కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చివరకు న్యాయవ్యవస్థ ద్వారానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది.

Tags:    

Similar News