నిమ్మగడ్డ పిటీషన్ పై విచారణ నేటికి వాయిదా

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. బుధవారం దీనిపై విచారణ జరిగింది. గవర్నర్ కు తాను [more]

Update: 2021-04-01 00:58 GMT

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. బుధవారం దీనిపై విచారణ జరిగింది. గవర్నర్ కు తాను రాసిన లేఖలు లీకయ్యాయని, దీనిపై సీబీఐ తో విచారణ జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ వేశారు. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరుపున న్యాయవాది వాదనలు పూర్తయ్యాయి. దీంతో తదుపరి విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది.

Tags:    

Similar News