నిమ్మగడ్డ భేటీకి వైసీపీ డుమ్మా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను సేకరించనున్నారు. అయితే ఈ సమావేశానికి వైసీపీ [more]

Update: 2020-10-28 02:16 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను సేకరించనున్నారు. అయితే ఈ సమావేశానికి వైసీపీ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తొలుత ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఈ విషయం సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే మిగిలిన పక్షాలన్నీ ఈ సమావేశానికి హాజరవుతున్నాయి.

Tags:    

Similar News