సింగిరెడ్డికి సీటు ఎలా దక్కిందంటే…??

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా [more]

;

Update: 2019-02-19 06:31 GMT
నిరంజన్ రెడ్డి
  • whatsapp icon

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులుగా పేరుంది. టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగానే ఆయన కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడినా ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ గా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయన మొదటిసారి విజయం సాధించడంతో ముందు నుంచీ అనుకున్నట్లుగానే ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు. మొదటిసారి మంత్రి అయినా ప్రణాళిక సంఘంలో పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయనకు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News