నిర్మల దులిపేశారు…!!
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. రాఫెల్ ఒప్పందంపై లోక్ సభ లో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడిన తీరు అందరినీ [more]
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. రాఫెల్ ఒప్పందంపై లోక్ సభ లో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడిన తీరు అందరినీ [more]
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. రాఫెల్ ఒప్పందంపై లోక్ సభ లో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్లుకుంది. కాంగ్రెస్ ను దులిపేశారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తుందని నిర్మల మండిపడ్డారు. రాహుల్ గాంధీ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు దేశాన్ని తప్పదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు. హెచ్ఎఎల్ పై ప్రేమ ఒలకపోస్తున్న కాంగ్రెస్ కు అందులో ఉన్న లోపాలు తెలియదా? అని ప్రశ్నించారు.హెచ్ఎఎల్ సామర్థ్యం ఎంతో తెలుసుకోలేరా? అని నిలదీశారు. హెచ్ఎఎల్ ఏడాదికి కేవలం ఎనిమిది తేజస్ విమానాలను మాత్రమే తయారు చేయగలదనిచెప్పారు. హోలెండీ వ్యాఖ్యలపై రాహుల్ తప్పుడు సమాచార మిచ్చారన్నారు. హోలెండ్ తో రాహుల్ భేటీని కాంగ్రెస్ పార్టీ ధృవీకరించాలని నిర్మల డిమాండ్ చేశారు.
కమీషన్ల కోసమే కాంగ్రెస్….
ఒక్కో స్వ్కాడ్రన్ లో 18 యుద్ధ విమానాలుంటాయని, తాము 36 యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామన్నారు. తమ హయాంలో హెచ్ఎల్ సామర్థ్యాన్ని రెట్టింపుచేశామన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో డిఫెన్స్ ను పట్టించుకోలేదన్నారు. యూపీఏ డిఫెన్స్ కు ఇచ్చిన కాంట్రాక్టుల కంటే తామే ఎక్కువ ఇచ్చామనిచెప్పారు. యూపీఏ హయాంలో కమీషన్ల కోసమే ఒప్పందం కుదరలేదన్నారు. యూపీఏ తీరువల్లనే యుద్ధ విమానాల కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. 2022 కల్లా 362 రాఫెల్ యుద్ధవిమానాలు డెలివరీ అవుతాయన్నారు. నాణ్యతతో పాటు ఖరీదు విషయంలో కూడా తాము అన్ని జాగ్రత్తలను పాటించామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాఫెల్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలన్నారు. దేశం కోసం, సైన్యం కోసం తాము ఎన్నడూ తప్పు చేయమని, చేయబోమని నిర్మల తెలిపారు.