బీజేపీకి నితీశ్ షాక్ ఇవ్వనున్నారా..?

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలకు ఊహించని విధంగా మద్దతు లభించింది. రాఫేల్ డీల్ లో బీజేపీకి తమ మద్దతు ఉండదని ఆ పార్టీ మిత్రపక్షం [more]

Update: 2019-01-03 13:06 GMT

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలకు ఊహించని విధంగా మద్దతు లభించింది. రాఫేల్ డీల్ లో బీజేపీకి తమ మద్దతు ఉండదని ఆ పార్టీ మిత్రపక్షం శివసేన చెప్పిన మర్నాడే బీజేపీకి మరో ఊహించని షాక్ తగిలింది. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఓటింగ్ కు వస్తే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్ యునైటెడ్ స్పష్టం చేసింది. ఈ బిల్లుపై తొందర పడటం సరికాదని, ఇంకా సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉందని జేడీయూ స్పష్టం చేసింది.

మిగతా మిత్రపక్షాలూ..?

ఇప్పటికే జేడీయూ తో పాటు మరో మిత్రపక్షమైన రామ్ విలాస్ పాశ్వాన్ కి చెందిన లోక్ జనశక్తి పార్టీ కూడా బీజేపీ ‘ఆలయ అజెండా’కు మద్దతు ఇవ్వమని స్పష్టం చేసింది. ఇక, ఉత్తరప్రదేశ్ లోనూ ఎన్డీఏలో ఉన్న అప్నాదళ్ కూడా బీజేపీ పట్ల సీట్ల పంపకంలో అసంతృప్తితో ఉంది. అందుకే ఆ పార్టీ పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. ఇక రాఫేల్ డీల్ పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలనే ప్రతిపక్షాల డిమాండ్ కి బీజేపీ మిత్రపక్షం శివసేన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News