చిన్నారుల్లో నోరోవైరస్.. హైదరాబాద్ లో 5 కేసులు

458 మంది చిన్నారుల మర నమూనాలను సేకరించి పరీక్షించగా.. ఐదుగురు చిన్నారులకు నోరో వైరస్ సోకినట్లు తేలిందని వారు తెలిపారు.

Update: 2022-04-18 12:20 GMT

హైదరాబాద్ : నగర వాసులను మరో కొత్తవైరస్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఫోర్త్ వేవ్ హెచ్చరికలతో భయపడుతున్న నగరవాసులను ఈ కొత్తవైరస్ కలవరపెడుతోంది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో నోరో వైరస్ కేసులు బయటపడ్డాయి. భాగ్యనగరంలోనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని గాంధీ ఆస్పత్రి, ఎల్లా ఫౌండేషన్ కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. నగరంలోని ఐదేళ్లలోపు చిన్నారుల్లో నోరోవైరస్ కేసులను గుర్తించేందుకు మైక్రోబయాలజిస్ట్ లు ఒక అధ్యయనం చేశారు.

458 మంది చిన్నారుల మర నమూనాలను సేకరించి పరీక్షించగా.. ఐదుగురు చిన్నారులకు నోరో వైరస్ సోకినట్లు తేలిందని వారు తెలిపారు. ఈ వైరస్ అన్ని వయసుల వారిలో డయేరియా (అతిసారా)కు దారితీస్తుందని హెచ్చరించారు. నోరో వైరస్ సోకిన వారిలో వాంతులు, నీళ్ల విరేచనాలు, డీ హైడ్రేషన్, నీరసం, లో ఫీవర్, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా వాంతులు, విరేచనాలతో వారి శరీంలోని నీటి శాతం, లవణాల శాతం తగ్గిపోతుంది. ఒకట్రెండు విరేచనాలకు కంగారు పడనక్కర్లేదు కానీ.. అంతకుమించి విరేచనాలు అయితే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.






Tags:    

Similar News