Petrol : వరసగా పెరుగుతున్న పెట్రో ధరలు

చమురుసంస్థలు వినియోగదారులపై ఎలాంటి కనికరం చూపడం లేదు. పండగ అని కూడా చూడటం లేదు. ప్రతి రోజూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా వినియోగదారులు [more]

Update: 2021-10-16 01:56 GMT

చమురుసంస్థలు వినియోగదారులపై ఎలాంటి కనికరం చూపడం లేదు. పండగ అని కూడా చూడటం లేదు. ప్రతి రోజూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోలు ధరల ప్రభావం నిత్యావసరవస్తువుల మీద పడుతుండటంతో వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. మూడు వారాల్లో పెట్రోలు ధరలు 15 సార్లు పెరగగా, డీజిల్ ధరలు 18 సార్లు పెరిగాయి.

హైదరాబాద్ లో నేటి ధరలు ఇవే….

తాజాగా శనివారం కూడా చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోలుపై లీటరుకు 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 109.72గా ఉంది. ఇక డీజిల్ ధర లీటర్ 102.80 గా ఉంది. పెట్రోలు ధరలు రోజూ చమురు సంస్థలు పెంచుతుండటంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News