చేరేవారెవరురా? తెలంగాణ ను షేక్ చేస్తున్న 21st

ఈ నెల 21వ తేదీన చౌటుప్పల్ లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

Update: 2022-08-08 08:26 GMT

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఎవరు చేరతారన్న దానిపై రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నెల 21వ తేదీన చౌటుప్పల్ లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అమిత్ షా సమక్షంలో చేరేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రచారం చేస్తుంది బీజేపీ నేతలయినా వెళ్లేది ఎవరన్న టెన్షన్ పార్టీలను పట్టి పీడిస్తుంది. బీజేపీలో భారీ చేరికలుంటాయని కమలనాధులు ప్రచారం చేస్తున్నారు.

మైండ్ గేమ్..?
మైండ్ గేమ్ లో భాగంగా బీజేపీ ప్రచారం చేస్తుందా? నిజంగానే చేరికలు ఎక్కువగా ఉంటాయా? అన్నది రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. నిజానికి ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక కోసం అమిత్ షా చౌటుప్పల్ కు వచ్చే అవకాశం లేదు. ఆయన నేతల చేరిక జాబితాను చూసిన తర్వాతనే వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి ఈ చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న టాక్.
కోమటిరెడ్డితో పాటు..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు చేరతారు. తర్వాత వరంగల్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు కూడా షా సమక్షంలో కండువా కప్పుకోవచ్చు. చేరికల కమిటీకి ఈటల రాజేందర్ నేత గా ఉన్నారు. నేతల పేర్లతో కూడిన జాబితా రూపొందించి పార్టీ కేంద్ర నాయకత్వానికి అందించారని తెలుస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన సర్వేల అనుసరించి అత్యంత రహస్యంగా నేతలను రెడీ చేశారన్న టాక్ తెలంగాణలో బలంగా వినిపిస్తుంది. నేతల చేరికకు భారీ ప్లాన్ ను బీజేపీ సిద్ధం కావడంతో రాజకీయ పార్టీలు షేక్ అవుతున్నాయి.
ప్రచారంలో పలువురి పేర్లు...
ఖమ్మం జిల్లా నుంచి కూడా కొందరు నేతలు బీజేపీలోకి చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ లోనూ అసంతృప్త నేతలకు కొదవ లేదు. వచ్చే ఎన్నికల్లో తమకే టిక్కెట్ గ్యారంటీ అన్నది లేదు. అందుకే ఏడాదిన్నర ముందుగానే జంప్ అయ్యేందుకు సిద్ధం కావాలని అనేక మంది మాజీలు నిర్ణయించుకున్నారని టాక్. భారీ చేరికలతో బీజేపీ తెలంగాణలో అధిక సంఖ్యంలో నియోజకవర్గాల్లో బలోపేతం కావాలని చూస్తుంది. మరి 21వ తేదీన ఎవరు చేరతారు? వారి పేర్లు ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. రాజకీయ పార్టీల్లో అదే టెన్షన్ గా మారింది.


Tags:    

Similar News