కళ్లు చెదిరేంత డబ్బు…డైమండ్లు…బంగారం

కల్కి భగవాన్‌ ఆశ్రమాల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. రెండ్రోజులుగా జరిగిన ఐటీ సోదాల్లో రూ.33 కోట్ల విలువైన నగదు దొరికిందని, ఇందులో రూ.9కోట్ల విదేశీ [more]

Update: 2019-10-18 11:57 GMT

కల్కి భగవాన్‌ ఆశ్రమాల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. రెండ్రోజులుగా జరిగిన ఐటీ సోదాల్లో రూ.33 కోట్ల విలువైన నగదు దొరికిందని, ఇందులో రూ.9కోట్ల విదేశీ కరెన్సీ ఉందని అధికారులు తేల్చారు. మూడు రోజులుగా మొత్తం దాడుల్లో 500 కోట్ల అక్రమ ఆస్తులు, 5 కోట్ల విలువైన డైమండ్లు లభించినట్లు సమాచారం. అలాగే 20 కేజీల బంగారం ఆశ్రమంలో లభ్యమయినట్లు తెలుస్తోంది. ఇక వెండి ఎంత ఉందో లేక్కేలేదు. భగవాన్‌గా పిలుచుకొనే విజయకుమార్‌ పెద్దసంఖ్యలో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఐటీశాఖ దేశవ్యాప్తంగా ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో మూడు రోజులుగా సోదాలు చేస్తుంది. చెన్నై కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కల్కి ఆశ్రమానికి చెందిన నిధులతో లాస్‌ఏంజెల్స్ లో కంపెనీ నడుపుతున్నారని, తమిళనాడు, ఆఫ్రికా దేశాల్లో భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారని ఐటీశాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. బుధవారం నుంచి కొనసాగుతున్న దాడుల్లో మొత్తం 500 కోట్ల అక్రమ ఆస్తులు, 5 కోట్ల విలువైన డైమండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

 

 

Tags:    

Similar News