ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి

కింగ్ కోటి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ముగ్గురు రోగులు చనిపోయారు. చాలా మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. [more]

Update: 2021-05-10 01:15 GMT

కింగ్ కోటి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ముగ్గురు రోగులు చనిపోయారు. చాలా మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. జడ్చర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ దారి తప్పి పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. నారాయణగూడ పోలీసులు సకాలంలో స్పందించడంతో భారీ ముప్పు తప్పింది. లేదంటే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి. జడ్చర్ల నుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్ దారి తప్పి పోయాడు. కింగ్ కోటి కి రావలసిన ఆక్సిజన్ నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి పోయింది. అంతేకాకుండా డ్రైవర్ హైదరాబాదులో సరియైన రూట్స్ తెలియకపోవడంతో చాలా సేపు సిటీలో తిరిగాడు. కింగ్ కోటి ఆసుపత్రిలో నోడల్ అధికారిగా ఉన్న వాళ్లు ఆక్సిడెంట్ ట్యాంకర్ డ్రైవర్ కు సరైన రీతిలో రూట్స్ చెప్పలేదు. దీంతో ఆక్సిజన్ ట్యాంకర్ తీసుకొస్తున్న డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్లాలో తెలియదు దీంతో అతను కొద్ది సేపు నిలిపి వేసి రోడ్డుపైన ఉండిపోయాడు. ఇంతలోనే కింగ్ కోటి ఆసుపత్రిలో ఆక్సిజన్ పూర్తిగా ఖాళీ అయిపోయింది.. ఆక్సిజన్ పై చికిత్స పొందుతున్న తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అందులో పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు చనిపోవడం జరిగింది. ఆక్సిజన్ అందకపోవడంతో చాలామంది నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు వెంటనే రంగంలోకి దిగాడు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్ ను వెంటనే హుటాహుటిన కింగ్ కోటి కి తరలించాడు. రోడ్డు మొత్తం క్లియర్ చేసి నిమిషాల విధులు కింగ్ కోటి ఆస్పత్రికి తీసుకు వచ్చాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది దీనిపైన నోడల్ అధికారి మాట్లాడుతూ చనిపోయిన వారంతా కూడా చివరి దశలో ఆసుపత్రికి వచ్చిన వాళ్లు లేనని చెప్పాడు. మృతుల బంధువులు మాత్రం ఆక్సిజన్ అందకపోవడం వల్లనే తమ వాళ్ళు చనిపోయారని ఇది ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్పారు. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News