వచ్చే ఆదివారం దేశమంతా స్వయంప్రకటిత కర్ఫ్యూ

దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉందన్నారు. గత రెండు [more]

Update: 2020-03-19 14:58 GMT

దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉందన్నారు. గత రెండు నెలల నుంచి ఈ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందన్నారు. ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను ఇంకా కనుగొన లేదన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు ఉన్నాయన్నారు మోదీ. అందరూ కలసి కరోనా పై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొన్ని వారాల పాటు దేశం కోసం త్యాగాలు చేయాలన్నారు. దేశంలో కరోనా ప్రభావం లేదనుకోవడం తప్పన్నారు. అయితే దీనికి ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. ధృఢ సంకల్పంతో వ్యవహరించి, జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారిని త్వరగా తరిమేయవచ్చని మోదీ అభిప్రాయపడ్డారు.

మరింత పెరగవచ్చు…..

కొన్ని రోజల్లో కరోనా బాధితుల సంఖ్య పెరగబోతుందన్నారు. ప్రజలు ఎవరూ ఇళ్లను వదలి బయటకు రావద్దని పిలుపు నిచ్చారు. సీనియర్ సిటిజన్లు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కేంద్ర మార్గదర్శకాలను పాటించాలన్నారు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిదని మోదీ ప్రజలకు సూచించారు. మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటిని వదిలి బయటకు రావద్దని చెప్పారు. వచ్చే ఆదివారం 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ ప్రజలు స్వచ్ధందంగా కర్ఫ్యూ పాటించాలని పేర్కొన్నారు. దేశంలో ఎవరూ ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు. ఇలా ప్రాక్టీస్ చేస్తే ముందు ముందు అత్యవసర పరిస్థితుల్లో దానికి అలవాటు పడతామని చెప్పారు. నిత్యావసర వస్తువల కొరత ఉండబోదన్నారు. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, ఎప్పటిలాగే నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయాలని మోదీ కోరారు.

Tags:    

Similar News