బ్రేకింగ్: దెబ్బకు దిగొచ్చిన పాక్..!

అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పాక్ తలొంచుతోంది. నిన్న పాక్ అదుపులోకి తీసుకున్న మన పైలట్ అభినందన్ ను రేపు విడుదల [more]

Update: 2019-02-28 11:19 GMT

అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పాక్ తలొంచుతోంది. నిన్న పాక్ అదుపులోకి తీసుకున్న మన పైలట్ అభినందన్ ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు భారత్ దౌత్యం చేస్తోంది. నిన్న అభినందన్ ను అదుపులోకి తీసుకున్నాక భారత్ ఈ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. అభినందన్ ను విడుదల చేయాల్సిందిగా దౌత్యపరంగా ఒత్తిడి చేసింది. భారత్ కు అన్ని దేశాల నుంచి మద్దతు కూడా లభించింది. దీంతో భారత ప్రయత్నాలకు తల వంచిన పాక్ అభినందన్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. నిన్న కూడా యుద్ధం వద్దని, చర్చలు జరపాలని భారత్ ను పాక్ ప్రధాని ఇమ్రాన్ కోరిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News