పైలట్ అభినందన్ ను దారుణంగా హింసించిన పాక్

పాకిస్తాన్ ఆర్మీకి దొరికిన భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ దారుణంగా హింసించింది. మన మిగ్-21 విమానం కూలిపోయినప్పుడు పారచ్యూట్ ఆధారంగా అభినందన్ పాక్ భూభాగంలో [more]

Update: 2019-02-27 11:04 GMT

పాకిస్తాన్ ఆర్మీకి దొరికిన భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ దారుణంగా హింసించింది. మన మిగ్-21 విమానం కూలిపోయినప్పుడు పారచ్యూట్ ఆధారంగా అభినందన్ పాక్ భూభాగంలో దిగారు. ఆయనను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నప్పుడు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. కానీ పాకిస్తాన్ విడుదల చేసిన వీడియోలో మాత్రం అభినందన్ తీవ్ర గాయాలతో కనిపించారు. ఆయనను పాక్ ఆర్మీ తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోంది. అభినందన్ దొరకగానే పాక్ ఆర్మీ ఆయనపై దాడి చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయంలో పాకిస్తాన్ యుద్ధ నియమాలను కూడా ఉల్లంఘించింది. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధంలో దొరికిన అవతలి దేశ సైనికుడిని హింసించకుడదు. కానీ, ఈ నియమానికి కూడా పాక్ తూట్లు పొడిచింది. అభినందన్ వర్ధమాన్ స్వస్థలం చెన్నైకి చెందిన వారుగా తెలుస్తోంది. ఆయన తండ్రి వర్ధమాన్ కూడా ఎయిర్ ఫోర్స్ లోనే పనిచేశారు. ఆయన రిటైర్డ్ ఎయిర్ మార్షల్.

Tags:    

Similar News