హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన పరిపూర్ణానంద స్వామి సెప్టెంబర్ 4న హైదరాబాద్ కి వస్తున్నట్లు ప్రకటించింది. మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారనే కారణంతో హైదరాబాద్ పోలీసులు పరిపూర్ణానంద స్వామిపై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ వేటు వేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పరిపూర్ణానంద స్వామి హైకోర్టుకు వెళ్లగా నగర బహిష్కరణ చెల్లదని తీర్పు వచ్చింది. దీంతో బీజేపీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఇతర నేతలు ఆయనను కలిసి హైదరాబాద్ కి రావాలని కోరారు. హైదరాబాద్ వస్తానని, తనపై బహిష్కరణ వెనుక కుట్రలను త్వరలోనే బయటపెడతానని ఆయన పేర్కొన్నారు. 250 మంది అమాయకులను చంపిన కసబ్ ను దేశంలో ఉంచారని, తనను మాత్రం బహిష్కరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.