హైదరాబాద్ లో దొరికిన రాప్తాడు డబ్బు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పంచడానికి తరలిస్తున్న డబ్బు హైదరాబాద్ లో పట్టుబడింది. హైదరాబాద్ ఆరాంఘర్ ప్రాంతంలో పోలీసులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను పోలీసులు తనిఖీ చేస్తుండగా సంతోష్ రెడ్డి [more]

Update: 2019-04-02 08:01 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పంచడానికి తరలిస్తున్న డబ్బు హైదరాబాద్ లో పట్టుబడింది. హైదరాబాద్ ఆరాంఘర్ ప్రాంతంలో పోలీసులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను పోలీసులు తనిఖీ చేస్తుండగా సంతోష్ రెడ్డి అనే వ్యక్తి వద్ద లెక్కలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.24 లక్షలను పట్టుకున్నారు. సంతోష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడు, రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ డబ్బును రాప్తాడులో పంచడానికి తెలుగుదేశం పార్టీ నేతలు తరలిస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రాప్తాడులో పరిటాల శ్రీరామ్ ను గెలిపించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News