నాలుగు ముక్కల్లో తేల్చేసిన బాలరాజు

జనసేన నేత బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం బాలరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తన రాజీనామా లేఖను పంపారు. రేపు [more]

Update: 2019-11-02 12:10 GMT

జనసేన నేత బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం బాలరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తన రాజీనామా లేఖను పంపారు. రేపు విశాఖపట్నంలో జనసేన ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ చేస్తున్న సందర్భంగా అదే జిల్లాకు చెందిన నేత బాలరాజు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. నాలుగు ముక్కల్లో బాలరాజు తేల్చేశారు. ఐదు నెలల పాటు మీతో ప్రయాణం చేసినందుకు, నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూనే కొన్ని నిర్ణయాలు వేదనాభరితమైనా తీసుకోక తప్పని పరిస్థిత అని బాలరాజు తన లేఖలో పేర్కొన్నారు. ఈ క్షణం నుంచే తాను పార్టీలో కొనసాగలేనని బాలరాజు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం బాలరాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Tags:    

Similar News