యురేనియం తవ్వకాలపై అఖిలపక్షం

నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తామన్నారు. మూడు రోజుల్లో అన్ని పార్టీలతో [more]

Update: 2019-09-09 13:22 GMT

నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తామన్నారు. మూడు రోజుల్లో అన్ని పార్టీలతో పాటు పర్యావరణవేత్తలతో మాట్లాడుతామన్నారు. యురేనియం తవ్వకాలతో ప్రజల జీవితాలు నాశనమవుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అనేక మంది ఈ తవ్వకాలపై జనసేన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాం – వి.హెచ్

యూరేనియం తవ్వకాలు తెలుగు రాష్ట్రాల సమస్యగా వి.హనుమంతరావు చెప్పారు. నల్లమల్ల ప్రాంతంలో జీవవైవిధ్యం
దెబ్బతిని జంతువులు మృత్యువాత పడుతున్నాయన్నారు. యురేనియం తవ్వకాలపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా
స్పందించారని, అఖిల పక్ష భేటీలో దీనిపై చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితెస్తామన్నారు వి. హనుమంతరావు .

 

 

Tags:    

Similar News