జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊహించినట్లుగానే ప్రకటనచేశారు. తెలంగాణ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసిన తర్వాత ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించడం విశేషం. తొలుత తెలంగాణ నుంచే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. కొండగట్టు ఆంజనేయస్వామి గుడి నుంచి ప్రారంభించిన ఆయన యాత్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అయింది. అయితే పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్న విషయాన్ని నేటి వరకూ స్పష్టం చేయలేదు. తాజాగా నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆపార్టీ నుంచి ప్రకటన విడుదలయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు జనసేన దూరంగా ఉంటుందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తామని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు రావడంతో్నే తాము పోటీ చేయలేకపోతున్నామని జనసేనాని వివరణ ఇచ్చుకున్నారు.