పవన్ కళ్యాణ్ ను పిలవరా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ [more]

Update: 2019-05-28 08:12 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు. ఇక, ఇవాళ ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక నాయకుడు పవన్ కళ్యాణ్ ను ఇంతవరకు జగన్ ఆహ్వానించలేదు. అసలు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది.

Tags:    

Similar News