ఏపీ రాజకీయాలపై పవన్ మరింత ఫోకస్.. ప్రభుత్వంపై విమర్శల వర్షం

ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు ఏదో ఒక అంశంపై రాజకీయాలు భగ్గుమంటూనే ఉంటాయి. ఒకరిపై ఒకరు..

Update: 2023-08-15 11:26 GMT

ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు ఏదో ఒక అంశంపై రాజకీయాలు భగ్గుమంటూనే ఉంటాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, తిట్ల దండకాలు.. ఉదయం లేచింది నుంచి రాత్రి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రోజూ చూస్తునే ఉంటాము. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో పలు ప్రాంతాల్లో వారాహి విజయ యాత్ర కొనసాగిస్తున్నారు. ఆగస్టు 10వ తేదీన విశాఖలో ప్రారంభమైన ఈ విజయం యాత్ర ఐదు రోజుల పాటు కొనసాగనుంది. విశాఖతో పాటు గాజువాక వారాహిలో పవన్ కల్యాణ్ రెండు బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సభలో పవన్ ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. విశాఖలో రుషికొండ పరిశీలనకు వెళ్లి ప్రభుత్వం విమర్శలు చేసిన పవన్.. గత రెండు యాత్రలకంటే యాత్రలో ఆరోపణల వర్షం కురిపించారు. విశాఖలో భూకబ్జాలు బాగా పెరిగిపోయాయని, అడ్డు అదుపులేకుండా పోతుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు సీఎం జగన్ పై అనేక కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. ఐదు రోజుల పాటు జరిగిన యాత్ర మొత్తం టెన్షన్ వాతావరణంలో కొనసాగింది. ఎక్కడ ఘర్షణలు తలెత్తుతాయోనని పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. జూన్లో వారాహి యాత్ర ప్రారంభించిన తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మొదటి రెండు యాత్రలు జరిగాయి. అప్పటి నుంచి పవన్ కేవలం వారాహి ద్వారా మాత్రమే రాష్ట్రంలో పర్యటన కొనసాగిస్తున్నారు. అయితే, మంగళగిరి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్.. ఆగస్ట్ 16 నుంచి తిరిగి విశాఖలో పర్యటించనున్నారు. ఈసారి వారాహి లేకుండా పర్యటన కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

విశాఖ షెడ్యూల్..

వారాహి విజయ యాత్ర మూడో విడత విశాఖలో ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆగస్ట్ 15న అమరావతి వెళ్లారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 19 వ తేదీ వరకూ విశాఖలో పవన్ పర్యటన కొనసాగనుంది. అయితే మధ్యలో ఒకరోజు బ్రేక్ తర్వాత తిరిగి పవన్ తన పర్యటన కొనసాగించనున్నారు. విశాఖపట్నం పర్యటనలో మిగిలిన రోజులు వారాహి వాహనం లేకుండానే పవన్ పర్యటన కొనసాగనుంది. షెడ్యూల్ ప్రకారం విశాఖపట్నం జిల్లాలో రెండు చోట్ల మాత్రమే బహిరంగ సభలున్నాయి. ఆ రెండు సభలు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన రోజుల్లో షెడ్యూల్ ప్రకారం ఎలాంటి బహిరంగ సభలు లేవు. మిగిలిన నాలుగు రోజుల పర్యటనలో కేవలం క్షేత్రస్థాయి పర్యటనలు, పార్టీ సమావేశాలు ఉన్నాయి. రుషి కొండ పర్యటనకు వెళ్లిన విధంగానే వారాహి బదులు ఇతర కార్లలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప వేరే ఇతర కారణాలు లేవంటున్నారు పార్టీ నాయకులు. అవసరం ఉన్నప్పుడే వారాహి వాహనాన్ని బయటకు తీస్తామని తెలిపారు.

విశాఖ పర్యటన షెడ్యూల్..

అయితే పవన్ కల్యాణ్ యాత్ర ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10 నుంచి 19 వరకు జరగనుంది. ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయిలో భూకబ్జాలపై పరిశీలన ఉంటుందని జనసేన తెలిపింది. ఇప్పటికే బహిరంగ సభలు ముగియడంతో ఆగస్ట్ 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు పవన్. ఆగస్టు 16వ తేదీన విశాఖపట్నంలో ఎర్ర మట్టి దిబ్బలను పరిశీలించనున్నారు. ఆగస్టు 17న వైజాగ్ లో జనవాణి కార్యక్రమం, 18 లేదా 18న స్థానిక నేతలతో సమావేశం ఉండనుంది.

Tags:    

Similar News