కన్నీరు మున్నీరైన మాజీ మంత్రి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పీతల సుజాత కంటతడి పెట్టారు. తనపై టీడీపీ నేత అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ [more]

Update: 2019-04-03 07:55 GMT

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పీతల సుజాత కంటతడి పెట్టారు. తనపై టీడీపీ నేత అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… తన మంత్రి పదవి పోయినప్పుడు కూడా తాను పెద్దగా పట్టించుకోలేదని, స్పోర్టీవ్ గా తీసుకుని పనిచేశాన్నట్లు చెప్పారు. తనకు ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకున్నా బాధపడలేదని, అయినా తనను విమర్శించడం తగదన్నారు. అంబికా కృష్ణ సినిమా ఇండస్ట్రీలో చేసిన వేషాలు ఎవరికి తెలియదని ప్రశ్నించారు. అంబికా కృష్ణ నిన్న ఓ సభలో మాట్లాడుతూ… పీతల సుజాతకు పొగరు, అహంబావం, చేతగానితనం అని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, పీతల సుజాత తనకు సోదరి లాంటిదని, తన మాటలకు ఆమె నొచ్చుకొని ఉంటే క్షమించాలని అంబికా కృష్ణ ఇవాళ చెప్పారు.

Tags:    

Similar News