అర్హులు పెరిగారు.. వారికి కూడా నేడు

నేడు ఏపీలో పింఛను పంపిణీ జరగనుంది. ఒకటో తేదీనే పింఛన్లను అందిస్తానని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు నేడు లబ్దిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. కొత్తగా 1.15 లక్షల [more]

Update: 2020-07-01 02:55 GMT

నేడు ఏపీలో పింఛను పంపిణీ జరగనుంది. ఒకటో తేదీనే పింఛన్లను అందిస్తానని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు నేడు లబ్దిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. కొత్తగా 1.15 లక్షల మంది పింఛన్లు అందుకునేందుకు అర్హులయ్యారు. మొత్తం మీద దాదాపు 59 లక్షల మందికి పింఛన్లు ప్రభుత్వం అందచేయనుంది. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లను నేరుగా లబ్దిదారులకు అందజేయనున్నారు. కరోనా విపత్కర సమయంలోనూ పింఛన్ల పంపిణీ ఆగకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీంతో ఈరోజు ఉదయమే ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.

Tags:    

Similar News