దేశవ్యాప్తంగా వేడుకలు… అక్కడ మాత్రం నిరసనలు

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు నిరసనలు తెలిపి.. గణతంత్ర వేడుకలను బహిష్కరించారు. పౌరసత్వ సవరణ బిల్లు-2016ను వ్యతిరేకిస్తున్న ఈశాన్య [more]

Update: 2019-01-26 08:21 GMT

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు నిరసనలు తెలిపి.. గణతంత్ర వేడుకలను బహిష్కరించారు. పౌరసత్వ సవరణ బిల్లు-2016ను వ్యతిరేకిస్తున్న ఈశాన్య రాష్ట్రల్లోని పలు ప్రజా సంఘాలు ఇవాళ గణతంత్ర వేడుకలను బహిష్కరిస్తున్నట్లు పిలుపునిచ్చాయి. పలు ఉగ్రవాద సంస్థలు కూడా ఇదే పిలుపునిచ్చాయి. దీంతో గణతంత్ర వేడుకలు ఈ రెండు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో జరగడం లేదు. అధికారికంగా జరుగుతున్న కార్యక్రమాల్లోనూ సాధారణ పౌరులు పాల్గొనలేదు. మణిపూర్ లో అయితే, ఇంచుమించు ఖాళీ సభను ఉద్దేశించి గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ గణతంత్ర దినోత్సవ ప్రసంగం చేయాల్సి వచ్చింది. మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థి, ఎన్జీఓ సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News