బ్రేకింగ్ : ఏపీ పిటీషన్ ను మరో ధర్మాసనానికి బదిలీ

నదీ జలాల వినియోగం విషయంలో సుప్రీంకోర్టులో ఏపీ దాఖలు చేసిన పిటీషన్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. న్యాయపరంగానే తాము సమస్య [more]

Update: 2021-08-04 06:09 GMT

నదీ జలాల వినియోగం విషయంలో సుప్రీంకోర్టులో ఏపీ దాఖలు చేసిన పిటీషన్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. న్యాయపరంగానే తాము సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనమే విచారించాలని కోరినా జస్టిస్ ఎన్వీరమణ వేరే బెంచ్ కు బదిలీ చేశారు. న్యాయపరంగా కాకుండా ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలే సూచించారు. అందుకు తాను సహకరిస్తానని కూడా తెలిపారు. కాదంటే తాను రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాడిని కనుక వేరే బెంచ్ కు ఈ విచారణను బదిలీ చేస్తానని జస్టిస్ ఎన్వీ రమణ గతంలోనే చెప్పారు.

Tags:    

Similar News