పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టులో?

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో మరో పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టులో [more]

;

Update: 2021-01-25 01:54 GMT

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో మరో పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని, దీనివల్ల దాదాపు మూడు లక్షల మంది యువత ఓటు హక్కును కోల్పోనున్నారని దూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తమకు ఓటు హక్కు కల్పించిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటీషన్ లో కోరారు. ఆ పిటీషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News