Petrol : ధరలు తగ్గాయి… కొట్టించుకోండి

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెట్రోలు ధరలు తగ్గాయి. పెట్రోలుపై ఐదు రూపాయలు, డీజిల్ పై పది రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించిన [more]

Update: 2021-11-04 02:02 GMT

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెట్రోలు ధరలు తగ్గాయి. పెట్రోలుపై ఐదు రూపాయలు, డీజిల్ పై పది రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి తగ్గిన పెట్రోలు ధరలు అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుపై 6.33 రూపాయలు, డీజిల్ పై 12.79 రూపాయలు ధరలు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ ను తగ్గించుకోవడంతో కొంత ఊరట లభించింది.

మిగిలిన రాష్ట్రాలు….

దీంతో తాజాగా తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధరల 108.18కి చేరుకుంది. లీటరు డీజిల్ ధర 94.61కు చేరుకుంది. కాగా అనేక రాష్ట్రాలు పెట్రోలు ఉత్పత్తులపై వ్యాట్ ను తగ్గిచాయి. కర్ణాటక, గోవా, త్రిపుర, అసోం రాష్ట్రాలు లీటరు పెట్రోలుపై ఏడు రూపాయలు తగ్గించాయి. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 12 రూపాయలు తగ్గించింది. మిగిలిన రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గించాల్సి ఉంది.

Tags:    

Similar News