ఆంధ్రప్రదేశ్ లో పెథాయ్ తుఫాను పెను బీభత్సం సృష్టిస్తోంది. యానాం, తుని దగ్గర రెండుచోట్ల నిన్న తుఫాను తీరం దాటింది. దీంతో తుఫాను ప్రభావం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా జిల్లాలపై ఎక్కువగా కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో చలిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంది. చలిగాలుల తీవ్రతతో ఏపీ, తెలంగాణలో ఇప్పటికే 23 మంది మృతి చెందారు. ఏపీలో భారీగా పంట నష్టం సంభవించింది. చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకూలాయి. తుఫాను ప్రభావంతో 3.87 లక్షల ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లుగా భావిస్తున్నారు. రూ.450 కోట్ల విలువైన పంట నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.