తుపాను తీరం దాటినా…..?

ఫొని తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది. ఈరోజు ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ఒడిశాలోని పూరి సమీపంలో బలుగోడు వద్ద తీరం దాటనుందని వాతావరణ [more]

Update: 2019-05-03 02:51 GMT

ఫొని తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది. ఈరోజు ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ఒడిశాలోని పూరి సమీపంలో బలుగోడు వద్ద తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫొని తుపాను తీరం దాటనుండటంతో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ తుపాను దెబ్బకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విలవిలలాడుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా శ్రీకాకుళంలో విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. ఒడిశాలో భారీ వర్షాల కురిస్తే శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు. విమాన రాకపోకలను నిలిపివేశారు. కాకినాడ పోర్టులో 8వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్ర తీరప్రాంతంలో అలలు ఎగిసి పడుతున్నాయి.దాదాపు ఎనిమిది లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

Tags:    

Similar News