పితానిని వదిలి… చుట్టూ క్లోజ్ చేస్తున్నారా …?

ఈఎస్ఐ స్కామ్ ఎపి లో హాట్ టాపిక్ గా సాగుతుంది. ఈ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత టిడిపి శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. [more]

Update: 2020-07-12 00:30 GMT

ఈఎస్ఐ స్కామ్ ఎపి లో హాట్ టాపిక్ గా సాగుతుంది. ఈ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత టిడిపి శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాంతో ఎదురుదాడి మొదలు పెట్టాయి. ఇదంతా కక్ష సాధింపు కోసమే అన్నది టిడిపి. ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరి అక్కడి నుంచి జైలుకు తరువాత హై కోర్టు కి అక్కడి నుంచి ఆసుపత్రికి ఇలా కథ సాగింది. అయితే ఈ కేసు మరికొందరి టిడిపి నేతల మెడకు చుట్టుకోవడం ఖాయంగా దర్యాప్తు తీరు చెప్పక చెబుతుంది. ఇప్పటికే ఈ ఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్న తో సహా 10 మందిని అరెస్ట్ చేసింది ఎసిబి.

మురళి మోహన్ అరెస్ట్ తరువాత …

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పిఎస్ మురళి మోహన్ ను ఎసిబి అరెస్ట్ చేసింది. అలాగే మాజీ మంత్రి తనయుడు పితాని వెంకట సురేష్ పై సెర్చ్ నోటిస్ జారీ చేసి గాలిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పితాని సురేష్ మాజీ పిఎస్ మురళిలు హై కోర్ట్ లో యాంటిసిపేటరి బెయిల్ కోసం అభ్యర్ధించారు. ఇది ఫైల్ అయిన తరువాత ఎసిబి కేసును వేగవంతం చేసింది. ఈ ఎస్ ఐ స్కామ్ మందుల కొనుగోళ్ళలో వీరిద్దరి పాత్ర నిర్ధారించుకున్న తరువాతే ఎసిబి అరెస్ట్ లకు రంగం సిద్ధం చేసిందని వీరిని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు లభిస్తాయని భావిస్తున్నాయి దర్యాప్తు బృందాలు.

ఆధారాలు లభించిన తర్వాతనే….

అచ్చెన్నాయుడు కార్మిక శాఖమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత పితాని సత్యనారాయణ మంత్రి పదవిని చేపట్టారు. అయితే మందుల కొనుగోళ్లలో పితాని కుమారుడి జోక్యం ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. సరైన ఆధారాలు లభించిన తర్వాతనే పితాని కుమారుడు సురేష్ ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అయిపోయారంటున్నారు. వీరి తరువాత మాజీ మంత్రి పితాని పై ఫోకస్ ఉంటుందా లేక ఆయన చుట్టూ ఉన్నవారు ఊచలు లెక్కపెడతారా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News