ఏపీ ప్రభుత్వం సహకరించక పోవడం వల్లనే?

రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. అనేక ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జరపక పోవడంతో అనేక [more]

Update: 2021-03-20 01:17 GMT

రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. అనేక ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జరపక పోవడంతో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయని చెప్పారు. తమ వంతు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేయలదని పియూష్ గోయల్ ఆరోపించారు. ఏపీలో పది కోట్ల రూపాయల విలువైన పనులు నిలిచిపోయాయన్నారు. కడప – మడగట్ట రైల్వేలైన్ పనులు ఆగిపోయాయని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పియూష్ గోయల్ తెలిపారు. కడప – బెంగళూరు రైల్వే లైన్ కు కూడా తాము ఆమోదం తెలిపామని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News