సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు : ప్రధాని మోదీ
అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ధికి కార్యక్రమాలకు ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆర్ఎఫ్ సీఎల్ సందర్శన అనంతరం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరువుల కర్మాగారాన్ని భద్రాచలం నుండి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. అక్కడి నుండే రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్-సిద్ధిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ పనులు, బోధన్, బాసర, భైంసా హైవే పనులకు, సిరొంచా-మహాదేవ్ పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేసి, దాని నిర్మాణాన్ని పూర్తి చేసి.. నేడు జాతికి అంకితం చేశామన్నారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు రామగుండంలో యూరియా ఫ్యాక్టరీని నిర్మించినట్లు తెలిపారు. 5 ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతోందని, రైతులకు నీమ్ కోటింగ్ యూరియా అందిస్తున్నామన్నారు.
సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేది లేదన్నారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిది.. మిగతాది కేంద్రానికి అయితే.. కేంద్రం ఎలా విక్రయిస్తుందన్నారు.