పోలవరం వద్ద మళ్లీ కుంగిన భూమి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వద్ద భూమి కుంగిపోతుండటం, పగుళ్లు ఏర్పడుతుండటంతో ఆందోళన నెలకొంటోంది. ప్రాజెక్టు వద్ద 902 ఏరియాలో భూమికి బీటలు [more]

Update: 2019-04-27 07:55 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వద్ద భూమి కుంగిపోతుండటం, పగుళ్లు ఏర్పడుతుండటంతో ఆందోళన నెలకొంటోంది. ప్రాజెక్టు వద్ద 902 ఏరియాలో భూమికి బీటలు ఏర్పడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో 20 అడుగుల మేర భూమికి పగుళ్లు ఏర్పడ్డాయి. పోలవరం ప్రాజెక్టు సమీపంలో భూమికి పగుళ్లు ఏర్పడటం ఇదే మూడోసారి. అయినా అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దఎత్తున భూమికి పగుళ్లు ఏర్పడుతున్నా అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇంత భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతంలో ఇలా పగుళ్లు ఏర్పడటం వల్ల ఆందోళన నెలకొంటోంది.

Tags:    

Similar News