హైడ్రామా… రేవంత్ అరెస్ట్

ప్రగతి భవన్ వద్ద రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. [more]

Update: 2019-10-21 07:13 GMT

ప్రగతి భవన్ వద్ద రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడికి రేవంత్ రెడ్డి తో సహా కార్యకర్తలు చేరుకున్నారు. మెరుపువేగంతో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డితో పాటు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే రేవంత్ రెడ్డితో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉదయం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది ముఖ్య నేతలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. పోలీసులకు చిక్కకుండా అగ్రనేతలంతా అదృశ్యమయ్యారు. ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి బైకుపై ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయ్యారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆర్టీసీ కార్మికులకు మద్దతు చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విద్యార్థులు చేపట్టారు. వందలాది మంది విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ నుంచి బయటకు రాగా మెయిన్ గేటు వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

Tags:    

Similar News