రౌడీషీటర్ వేధింపులకు తాళలేకే

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళ ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తమ విచారణలో నిత్యం వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. [more]

Update: 2020-09-29 02:46 GMT

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళ ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తమ విచారణలో నిత్యం వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. యువతి అత్మహత్యకు కారకుడైనా బాతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ లో భతుకు మధుసుదన్ యాదవ్ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెలను తరుచు లైంగిక వేదించేవాడు. అతని బాధలు భరించలేక చెల్లెలు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఈనెల 25వ తేది అత్మహత్య చేసుకుని మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, మధుసుదన్ ఇచ్చే జీతం డబ్బులను తండ్రికి ఇచ్చే వాళ్ళు ఇద్దరు అక్కాచెల్లెలు. అయితే ఈ నెల 24వ తేది రాత్రి 10గంటలకు పని నిమిత్తం మేడపైకి తీసుకెళ్ళాడు. తెల్లవారే సరికి చెల్లెలు ప్యానుకు ఉరి వేసికుని అత్మహత్య చేసుకుంది. అయితే, తన చెల్లెలు కడుపునొప్పి భరించలేక అత్మహత్య చేసుకుందని చెప్పాల్సిందిగా మృతురాలి అక్కకు మధుసుదన్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొయినబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఉస్మానియా మార్చరీకి తరలించి కేసు నమోదు చెసి దర్యాప్తు చెపట్టారు మధుసుదన్ పెట్టే లైంగికవేధింపులు భరించలేక తన చెల్లెలు చనిపోయిందని అక్క పొలీసులకు వెల్లడించింది. అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుసుదన్ ను అదుపులోకి తీసుకున్న అతనిపై నిర్భయ కేసుతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడిపై గతంలో మొయినాబాద్ పొలీసుస్టేషన్ లో రౌడిషీట్ ఉన్నట్లు శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.

Tags:    

Similar News