రమేష్ ఆసుపత్రి నిర్వాకంపై…వారికి నోటీసులు
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న రమేష్ ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్న ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ కంపెనీకి పోలీసులు [more]
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న రమేష్ ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్న ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ కంపెనీకి పోలీసులు [more]
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న రమేష్ ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్న ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ కంపెనీకి పోలీసులు సీఆర్పీసీ 10 కింద నోటీసులు జారీ చేశారు. రమేష్ ఆసుపత్రిలో ఈ కంపెనీ 250 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కంపెనీ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కంపెనీకి కూడా నోటీసులు ఇవ్వడంతో ప్రమాదంతో పాటు ఆసుపత్రి పూర్తి వ్యవహారాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం రమేష ఆసుపత్రిని ఆరోగ్యశ్రీని తప్పించింది. గత ఐదేళ్లలో చేసిన అక్రమాలను కూడా వెలికితీస్తున్నారు.