దుబ్బాక డబ్బులపై క్లారిటీ

దుబ్బాక లో దొరికిన డబ్బుల వ్యవహారం పై పోలీసులు స్పందించారు. నిన్న బిజెపి విడుదల చేసిన వీడియోలకు కౌంటర్ వీడియోలని పోలీసులు బయటపెట్టారు. అసలు అంజన్ రావు [more]

Update: 2020-10-27 07:36 GMT

దుబ్బాక లో దొరికిన డబ్బుల వ్యవహారం పై పోలీసులు స్పందించారు. నిన్న బిజెపి విడుదల చేసిన వీడియోలకు కౌంటర్ వీడియోలని పోలీసులు బయటపెట్టారు. అసలు అంజన్ రావు ఇంట్లో ఏం జరిగింది.?. అంజన్ రావు ఇంట్లో డబ్బులు ఎన్ని దొరికాయి?… అంజన్ రావు భార్య ఏం చెప్పింది? వీటన్నిటికీ ఈ వీడియోలో సమాధానమిచ్చారు. అయితే అంజన్ రావు ఇంట్లో 18 లక్షల పైచిలుకు నగదు పట్టుబడింది. దీనికి సంబంధించి అంజన్ రావు భార్య నే స్వయంగా ఈ డబ్బు మా ఆయన ఇచ్చానరని వీడియోలో పేర్కొంది. అంతేకాకుండా నోట్లు కట్టలు లెక్క పెట్టి ప్లాస్టిక్ కవర్లో స్వయంగా అంజన్ రావు భార్యనే పెట్టింది. ఈ వీడియోనీ పోలీసు అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఇప్పుడు కౌంటర్ వీడియో వైరల్ గా మారింది. మరోవైపు సోదాల సందర్భంగా తాము ఎవరి పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని, కోర్టు అనుమతి తీసుకొనే నిర్వహించామని, ఉద్దేశపూర్వకంగానే బిజెపి కార్యకర్తలు తమపై దాడులు చేసి డబ్బులు ఎత్తుకెళ్లారని సిద్ధిపేట పోలీసు కమిషనర్ వెల్లడించారు ఇప్పటికే దాడులు చేసి డబ్బులు ఎత్తుకెళ్లి వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వీరిపై కేసులు పెట్టి అరెస్టుకు పంపిస్తామని సిద్దిపేట కమిషనర్ వెల్లడించారు.

Tags:    

Similar News