గాంధీ గ్యాంగ్ రేప్ కట్టుకధేనా?

గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్. ఇది ఒక సంచలన విషయం. దీన్ని పూర్తిగా తెలంగాణలో రాజకీయంగా మారింది .ఈ కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. కేసును [more]

Update: 2021-08-20 02:07 GMT

గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్. ఇది ఒక సంచలన విషయం. దీన్ని పూర్తిగా తెలంగాణలో రాజకీయంగా మారింది .ఈ కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు పది ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేపు జరిగిన యువతి చేసిన ఫిర్యాదుపై పోలీసులు సవాల్ గా తీసుకొని విచారణ ప్రారంభించారు .అయితే యువతి చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు తేల్చి పారేశారు. తన వ్యక్తిగత అవసరం కోసమే యువతి గ్యాంగ్ రేప్ కట్టుకథ వెల్లడించారు. ఈనెల 8వ తేదీన తన బావను తీసుకొని గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అక్క చెల్లెలు బావ కలిసి రావడం జరిగింది. 11వ తేదీ వరకు అక్క చెల్లెలి ఇద్దరూ కూడా ఆసుపత్రి లోపలే ఉన్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కల్లు తాగే అలవాటు ఉంది . మందు కలిపిన కల్లు తాగే అలవాటు ఉండటంతో ఐదు రోజులపాటు కళ్ళు తీసుకోకపోవడంతో ఒక్కసారిగా శరీరంలో మార్పులు వచ్చాయి. కళ్ళు కోసం అక్క ఆస్పత్రి నుంచి బావను వదిలి పెట్టి వెళ్లి పోయింది. ఈ విషయాన్ని చెల్లి గుర్తించింది. అక్కను వెతుక్కుంటూ మొత్తం ఆసుపత్రి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికింది. అయినప్పటికీ అక్కడ జాడ దొరకలేదు. బావ అక్కడ నుంచి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు. అక్క బావ ఇద్దరు కనిపించకపోవడంతో గాబరా పడిపోయింది. యువతి ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ తో పరిచయం ఏర్పడింది. నాలుగు రోజుల పాటు సెక్యూరిటీ గాడితో ఉండిపోయింది. అతనితోపాటు రెండు రోజులు వ్యక్తిగతంగా కలిసింది. ఆస్పత్రిలో జరిగిన పరిణామాలు వ్యక్తిగతంగా తనకు జరిగిన పరిణామాలను కుటుంబ సభ్యులకు తెలిస్తే ఇబ్బంది కలుగుతుందని భావించింది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ కి వెళ్లి గాంధీ ఆస్పత్రిలో తనపై లతోపాటు ల్యాబ్ టెక్నీషియన్ గ్యాంగ్ రేప్ చేశారని ఫిర్యాదు చేసింది.

సీసీ కెమెరాలను ….

పోలీసులు అక్కడ కేసు నమోదు చేసుకోకుండా చిలకలగూడ పోలీస్ స్టేషన్ పంపించారు. దీనిని పోలీసులు సవాలుగా తీసుకొని విచారణ ప్రారంభించారు . ఈ నేపథ్యంలోనే దాదాపు వందల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు . అంతేకాకుండా ఎనిమిది వందల గంటల సీసీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించారు. ఏడు రోజుల వరకు అక్క దొరకలేదు. గ్యాంగ్ రేప్ కు సంబంధించి పోలీసులు పూర్తిగా శాస్త్రీయ ఆధారాల మీద దృష్టిపెట్టారు. కేవలం తన వ్యక్తిగత అవసరం కోసమే పోలీసులకు కట్టుకథ చెప్పారని పోలీసులు తెలిపారు. దీనిపైన యువతి మానసిక స్థితి తెలుసుకొని కోర్టుకు నివేదిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ లో రెండు గ్యాంగ్ రేప్ ల కేసులను పోలీసులు తేల్చి వేశారు. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా యువతులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు కొట్టిపారేశారు. శాస్త్రీయ ఆధారాలతో గ్యాంగ్ రేప్ జరిగనట్లుగా పోలీసులు తెలియజేశారు. సినిమాలను తలపించే రీతిలో యువత ఇద్దరు స్టోరీలు చెప్పారని పోలీసులు అంటున్నారు. అంతేకాకుండా తమ వ్యక్తిగత అవసరాల కొరకు ఇద్దరు మహిళలు కూడా సినిమా కథలను తమకు చుపెట్టారని పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News