ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది ఎన్నికల సంఘం. పోలింగ్ ముగిసి 24 గంటలు దాటినా ఎన్నికల సంఘం అధికారిక లెక్కలు ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే శనివారం రాత్రి 10. గంటల ప్రాంతంలో ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాల వారీగా నమోదైన ఓట్ల శాతం ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం ...
రాష్ట్రంలో 73.2 శాతం.....
మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 73.20 కాగా ఇందులో పురుషులు 72.54, మహిళలు 73.88, థర్డ్ జెండర్స్ 8.99 అత్యధికం గా పోలింగ్ మధిర నియోజవర్గం అయితే అత్యల్పం చార్మినార్ గా నిలిచింది. ఇక హైదరాబాద్ లో 48.89 అర్బన్ ప్రాంతాల్లో నమోదైన తక్కువ ఓటింగ్ లో ఒకటిగా నిలిచింది. అత్యధికంగా పోలింగ్ అయిన జిల్లాల్లో భువనగిరి 90.53 కాగా ఖమ్మం 84. 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.
పోల్ టాప్ జిల్లాలు ఇవే ...
పోల్ టాప్ లో పర్శంటేజ్ లో టాప్ 5 లో మధిర, ఆలేరు, మునుగోడు, నర్సాపూర్, భువనగిరి రికార్డ్ నెలకొల్పాయి. అయితే అత్యల్పం ఓటింగ్ నమోదు అయినవాటిలో చార్మినార్, యాకుత్ పురా, నాంపల్లి, జూబ్లీ హిల్స్ , చాంద్రాయణ గుట్ట గా నమోదు అయ్యాయి. జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఈవిధంగా వుంది.
ఆసిఫాబాద్ - 85.97
నిర్మల్ 81.22
మంచిర్యాల 78.72
ఆదిలాబాద్ 83.37
నిజామాబాద్ 76.22
కామారెడ్డి 83 . 05
జగిత్యాల 77. 89
పెద్దపల్లి 80. 58
కరీంనగర్ 78. 20
రాజన్న సిరిసిల్ల జిల్లా 80. 49
సంగారెడ్డి 81. 94
మెదక్ 88. 24
సిద్ధిపేట 84. 26
రంగారెడ్డి 61.29
వికారాబాద్ 76.87
మేడ్చల్ మల్కాజ్ గిరి 55. 85
హైదరాబాద్ 48. 89
మహబూబాబాద్ 78 .42
నాగర్ కర్నూల్ 82. 04
వనపర్తి 81. 65
జోగులాంబ గద్వాల్ 82. 87
నల్గొండ 86. 82
సూర్యాపేట 86. 63
యాదాద్రి భువనగిరి 90. 95
జనగాం 87. 39
మహబూబ్ నగర్ 89. 68
వరంగల్ రూరల్ 89 . 68
వరంగల్ అర్బన్ 71. 18
జయశంకర భూపాలపల్లి 82. 31
భద్రాద్రి కొత్తగూడెం 82. 46
ఖమ్మం 85. 99