అక్కడ యుద్ధం - ఇక్కడ సిద్ధం
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరుగుతుంటే, సందడంతా ఆ ప్రాంతంలోనే ఉంటుంది. రాజకీయ పార్టీలు, వాటి అభిమానులు, మిత్రపక్షాలు ఓ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుంటాయి.. ఒకప్పుడైతే మీడియా ప్రభావం ఓటర్లపై అంతో ఇంతో ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా జనం అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోంది. ట్విటర్, యూట్యూబ్, వాట్సప్, ఇన్‌స్టాగ్రాముల్లో కూడా ఎన్నికల సంగ్రామం జరుగుతోంది.
తెలంగాణ కోసం ‘ఆంధ్ర’ హడావుడి

తెలంగాణలో కూడా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ట్విస్ట్ ఏంటంటే, తెలంగాణ ఓటర్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ఆంధ్ర పార్టీలు ప్రయత్నించడం. తెలంగాణ బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మూడు పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. భాజపాకు జనసేన బాహాటంగా మద్దతు పలుకుతోంది. పొత్తులో భాగంగా ఓ తొమ్మిది అసెంబ్లీ సీట్లను కమలం పార్టీ జనసేనకు కేటాయించింది. కాబట్టి వాళ్ల మధ్య అగ్రిమెంట్ అధికారికమే.
తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని తెలుగుదేశం బలంగా కోరుకుంటోంది. దీనివల్ల ఏపీలో.. కేసుల ప్రవాహంలో కొట్టుకుపోతున్న తమకు కాస్తయినా ఊతం దొరుకుతుందని, ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు. ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’ అన్నట్లు రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢల్లీిలో మళ్లీ చక్రం తిప్పవచ్చని ఆ పార్టీ వర్గాలు గంపెడాఆశలు పెట్టుకున్నాయి. అక్కడ తెలుగుదేశం పోటీ చేయకపోవడానికి ఇది కూడా ఓ కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర సెటిలర్ల ఓట్లన్నీ కాంగ్రెస్‌కి బదిలీ చేయడానికి అక్కడ, ఇక్కడి చంద్రబాబు అభిమానులు ప్రయత్నిస్తున్నారు.
ఇక 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు దిమ్మతిరిగే ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చిన భారాస రుణం తీర్చుకోడానికి వైకాపా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకే బాణానికి రెండు పక్షులన్నట్లు, అక్కడ కేసీయార్‌ను గెలిపించడం, తెలుగుదేశాన్ని మరోసారి చావుదెబ్బ కొట్టడం అనే లక్ష్యాలుగా జగన్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ ప్రభావం సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రలోని మూడు పార్టీలు, తెలంగాణలోని మూడు పార్టీలకు పరోక్షంగా మద్దతిస్తూ, ఎన్నికల వేడిని మరింత రగిలిస్తున్నాయి.