పోస్టల్ బ్యాలెట్ పంపిణీలో అవకతవకలు..?
విశాఖపట్నం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు గురువారం వారు [more]
విశాఖపట్నం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు గురువారం వారు [more]
విశాఖపట్నం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు గురువారం వారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడితే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కలెక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల 4 వేల మంది ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోయారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను జిల్లా కలెక్టర్ సరిగ్గా అమలు చేయకుండా అతనే రాజు లాగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. 4 వేల మంది ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించుకున్న ముఖ్యమంత్రి వారి ఓటుహక్కు తీసేశారని, పైగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్ర చెప్పడం సిగ్గుచేటన్నారు.