Maa : “మా” ఎన్నికలపై కోర్టుకు?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. సోమవారం కోర్టును ఆశ్రయించే అవకాశముంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ పోలింగ్, కౌంటింగ్ సీసీ ఫుటేజీ [more]
;
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. సోమవారం కోర్టును ఆశ్రయించే అవకాశముంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ పోలింగ్, కౌంటింగ్ సీసీ ఫుటేజీ [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. సోమవారం కోర్టును ఆశ్రయించే అవకాశముంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ పోలింగ్, కౌంటింగ్ సీసీ ఫుటేజీ దృశ్యాలను ఎన్నికల అధికారిని కోరారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డితో ఈ కేసు వేయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
మంచు ఫ్యామిలీ మాత్రం…
మరోవైపు మంచు మనోజ్ తో పాటు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే మంచు ఫ్యామిలీ టాలీవుడ్ లోని ప్రముఖులను కలసి మా అసోసియేషన్ కు సహకరించాలని కోరుతుంది. కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, బాలకృష్ణతో పాటు పవన్ కల్యాణ్ ను కూడా మంచు ఫ్యామిలీ కలిసి మద్దతు కోరింది.