ఎన్నికల సంఘంపై ప్రణబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఓ వైపు ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఎన్నికల సంఘంపై ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యానికి [more]
ఓ వైపు ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఎన్నికల సంఘంపై ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యానికి [more]
ఓ వైపు ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఎన్నికల సంఘంపై ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికల నిర్వహణ సంస్థలు పట్టుకొమ్మలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఎన్నికలను చక్కగా నిర్వహిస్తోందన్నారు. దేశంలో మూడింట రెండొంతుల మంది ప్రజలు ఎన్నికల్లో భాగస్వామ్యులయ్యారని, తాను కూడా చాలా ఏళ్ల తర్వాత ఓటు వేశానన్నారు. మంచి కార్మకుడు పనిముట్లను సరిగ్గా వినియోగించుకుంటాడని, చెడ్డ కార్మికుడు పనిముట్లపై నిందలు వేస్తాడని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.