డీప్ కోమాలోకి ప్రణబ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడలేదు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ఈ మేరకు ఆర్మీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రణభ్ [more]

Update: 2020-08-27 07:22 GMT

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడలేదు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ఈ మేరకు ఆర్మీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రణభ్ ముఖర్జీ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మూత్రపిండాలు కూడా పనిచేయడం లేదని పేర్కొన్నాయి. ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ డీప్ కోమాలో ఉన్నారని తెలిపింది. నిపుణులైన వైద్యులు ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News