శిల్పాలు అందంగా ఉన్నాయి: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
సికింద్రాబాద్-బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన శిల్ప ఉద్యానవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నాడు ఆవిష్కరించారు.
సికింద్రాబాద్-బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన శిల్ప ఉద్యానవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నాడు ఆవిష్కరించారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని రాక్ గార్డెన్లో పెద్ద శిలలపై శివుని దక్షిణామూర్తి శిల్పం, శివుని వాహనమైన నంది శిల్పాలను సందర్శించిన ద్రౌపదీ ముర్ము, స్థాపత్య వేద రీసెర్చ్ ఫౌండేషన్, అధ్యక్షులు డి.ఎస్.వీ ప్రసాద్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి ఏర్పాటుచేసిన శివ-దక్షిణామూర్తి రూపాల ఎగ్జిబిషన్ ను తిలకించారు.
దక్షిణామూర్తి, నంది శిల్పాలను చెక్కిన శిల్పి పెంచల ప్రసాద్ స్థపతిని, పర్యవేక్షణకులు ఈమని శివనాగిరెడ్డిని రాష్ట్రపతి అభినందించారు. అనంతరం కంభంపాటి శంకర ప్రసాద్ గీసిన దక్షిణామూర్తి వర్ణ చిత్రాన్ని డి.ఎస్.వి ప్రసాద్ ఆమెకు బహూకరించారు.