ఉడకని "పప్పు" ధరెంతో తెలిస్తే?
కందిపప్పు ధర ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. కిలో కందిపప్పు ధర రూ.140లకు చేరుకుంది
కందిపప్పు ధర ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. కిలో కందిపప్పు ధర రూ.140లకు చేరుకుంది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని మార్కెట్‌లో హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు ధరలను పెంచేశారు. సూపర్ మార్కెట్‌ల నుంచి చిరు వ్యాపారుల వరకూ ధరలను పెంచేసి విక్రయిస్తున్నారు.
కిలో ధర మరింతగా...
ఈ ఏడాది దిగుబడి తగ్గటం కూడా ధరలు పెరగడానికి కారణమంటున్నారు. దాదాపు చాలా దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. కందిపప్పు లేనిదే ముద్ద దిగని వారు అనేక మంది ఉన్నారు. మొన్నటి వరకూ 103 రూపాయలు కిలో చొప్పున విక్రయించేవారు. కానీ ఉన్నట్లుండి రూ.140లు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి కూడా తగ్గించిందంటున్నారు. ఈ ఏడాది దేశంలో 38.9 లక్షల టన్నుల మాత్రమే పండటంతో కందిపప్పుకు మరింత డిమాండ్ పెరిగింది.